Bonthu rammohan: హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట విషాదం.. గుండెపోటుతో సోదరి మృతి

  • గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సునీత
  • నివాళులర్పించిన కడియం, ఎర్రబెల్లి 
  • వరంగల్ జిల్లా మెరిపిరాల గ్రామంలో అంత్యక్రియలు 

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోదరి సునీత శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. సోదరి మరణవార్త తెలుసుకున్న మేయర్ రామ్మోహన్ వెంటనే వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని మెరిపిరాల చేరుకున్నారు.

సునీత మృతి వార్త తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా పలువురు నేతలు, కార్యకర్తలు సునీత నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. నేటి మధ్యాహ్నం సునీత అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Bonthu rammohan
Hyderabad
Warangal Rural District
Kadiam Srihari
Errabelli
TRS
  • Loading...

More Telugu News