Uttam Kumar Reddy: మహాకూటమి కొనసాగుతుంది.. మిత్రపక్షాల్లో మంచి వాతావరణం ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఏ మిత్ర పక్షానికి ఎన్ని సీట్లనేది రేపు మాట్లాడుకుంటాం
  • రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది
  • కాంగ్రెస్ సభలకు సోనియా, రాహుల్ హాజరవుతారు

మహాకూటమి కొనసాగుతుందని, మిత్రపక్షాల్లో మంచి వాతావరణం ఉందని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ మిత్ర పక్షానికి ఎన్ని సీట్లు అనే విషయం రేపు మాట్లాడుకుంటామని, రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమికి 80 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించ బోయే బహిరంగ సభలకు సోనియా, రాహుల్ గాంధీలు హాజరుకానున్నట్టు చెప్పారు. మహాకూటమి పేరు మారుస్తున్నామని, ఒకట్రెండు రోజుల్లో ఆ పేరును వెల్లడిస్తామని వివరించారు.

Uttam Kumar Reddy
Congress
mahakutami
  • Loading...

More Telugu News