Amitabh Bachchan: త్వరలో మీ నిజాలు బయటపడతాయి.. సామాజికవేత్త అనే బిరుదు కూడా పోతుంది: అమితాబ్ పై హెయిర్ స్టయిలిస్ట్ సప్నా

  • ఇది చాలా పెద్ద అబద్ధం
  • కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారు
  • కొరుక్కోవడానికి మీకున్న గోళ్లు సరిపోవు

‘మీటూ’ ఉద్యమం గురించి ఇటీవల ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, అది మనసుని కలచి వేస్తోందని ఆయన ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిపై ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా భవ్నానీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటర్వ్యూలో భాగంగా బిగ్‌బి.. ‘ఏ మహిళ కూడా ఎక్కడా లైంగిక వేధింపులు ఎదుర్కోకూడదు. ముఖ్యంగా ఆమె పనిచేసే వాతావరణంలో అలాంటివి ఎదురైనప్పుడు సదరు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మన సమాజంలో మహిళలు, పిల్లలకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలి. మన దేశంలో పని చేసే ప్రదేశాల్లోనే మహిళలు ఎక్కువగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఇది మనసును కలచివేస్తోంది. వారికి దక్కాల్సిన గౌరవం, రక్షణ ఇవ్వకపోతే మన దేశంపై చెరిపేసుకోలేని మచ్చ పడుతుంది’’ అన్నారు.

బిగ్‌బి చెప్పిన దానిపై సప్నా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ఇది చాలా పెద్ద అబద్ధం. సర్‌.. మీరు నటించిన పింక్‌ సినిమా వచ్చింది... వెళ్లిపోయింది. అదే విధంగా మీకున్న సామాజికవేత్త అనే బిరుదు కూడా పోతుంది. త్వరలో మీ నిజాలు బయటపడతాయి. నా ట్వీట్‌ చదివి మీరు కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే కొరుక్కోవడానికి మీకున్న గోళ్లు సరిపోవు’ అని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. అమితాబ్‌ గురించి సప్నా ఏ నిజం బయటపెడుతుంది? అసలేం జరిగి ఉంటుందంటూ నెటిజన్లు సప్నాకు మెసేజ్‌లు పెడుతున్నారు.

Amitabh Bachchan
Mee Too
Sapna Bhavnani
Pink movie
  • Loading...

More Telugu News