chennai: చెన్నైలోని శంకర్ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకుడు శంకర్ దేవరాజన్ ఆత్మహత్య

  • ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న శంకర్
  • శంకర్ మృతిపై పలువురు దిగ్భ్రాంతి
  • 2004లో శంకర్ అకాడమీ స్థాపన

చెన్నైలోని శంకర్ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకుడు, సీఈవో దేవరాజన్ (45) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇంట్లోనే ఆయన ఉరి వేసుకుని ఈరోజు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు తెలిపారు. శంకర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. శంకర్ మృతి వార్త తెలుసుకున్న పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా, రైతు కుటుంబానికి చెందిన శంకర్ జన్మస్థలం కృష్ణగిరి. చిన్నతంలోనే ఆయన తండ్రి మరణించారు. వయసు పైబడటంతో యూపీఎస్సీ ఎగ్జామ్స్ కు అర్హత సాధించలేకపోయిన ఆయన, సివిల్స్ కు ప్రిపేర్ అయ్యే వారి కోసం 2004లో శంకర్ అకాడమీని స్థాపించారు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు తొమ్మిది వందల మంది అభ్యర్థులు సివిల్స్ కు ఎంపికై విజయం సాధించారు.

chennai
shankar IAS academy
devarajan
  • Loading...

More Telugu News