meat: దేశంలో ఉన్న వారంతా శాకాహారులుగా మారాలని అనుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
- అందరూ శాకాహారులుగా మారాలనే ఆదేశాలు ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
- మాంసం ఎగుమతులను నిషేధించాలన్న పిల్ ను విచారించిన సుప్రీం
- నవరాత్రుల సందర్భంగా ముంబైలో మాంసం షాపులను మూసివేయించిన శివసేన
మన దేశంలో ఉన్న వారంతా శాకాహారులుగా మారాలనే ఆదేశాలను ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మాంసం ఎగుమతులపై నిషేధం విధించాలంటూ వేసిన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా 'దేశంలో ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని మీరు కోరుకుంటున్నారా?' అంటూ పిటిషన్ దారులను ప్రశ్నించింది. తదుపరి విచారణను 2019 ఫిబ్రవరికి వాయిదా వేసింది.
మరోవైపు, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముంబైలో పలు చోట్ల హిందూ సంస్థల ఆధ్వర్యంలో బుధవారంనాడు నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మాంసం షాపులను నిరసనకారులు బలవంతంగా మూయించారు. కొందరు మాంసం వ్యాపారులు మాట్లాడుతూ, శివసేన కార్యకర్తలు తమ షాపులను బలవంతంగా మూయించారని ఆరోపించారు.