Telangana: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట..అసెంబ్లీ రద్దు పిటిషన్ల కొట్టివేత
- డీకే అరుణ పిటిషన్ సహా అన్ని పిటిషన్లు కొట్టివేత
- అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్లు
- కోర్టు కొట్టేసిన వాటిలో మాజీ ఎమ్మెల్యే రాములు, న్యాయవాది శశాంక్ రెడ్డి పిటిషన్లు
గత నెల 6వ తేదీన తెలంగాణ అసెంబ్లీ రద్దయిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లంటినీ హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, న్యాయవాది శశాంక్ రెడ్డి కొద్ది రోజులు కిందట పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లన్నింటిని ఈరోజు హైకోర్టు కొట్టివేసింది.
తెలంగాణ అసెంబ్లీ రద్దు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, ఎమ్మెల్యేలకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని డీకే అరుణ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 31న విచారణ జరగనుంది.