mee to: ‘మీ టూ’ ఉద్యమంపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ!

  • బాధితులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ చీఫ్
  • ప్రతిఒక్కరూ మహిళల్ని గౌరవించాలి
  • నిజాన్ని నిర్భయంగా, గట్టిగా చెప్పాలి

సినీ పరిశ్రమతో పాటు అన్ని రంగాల్లోనూ పాతుకుపోయిన లైంగిక వేధింపుల జాఢ్యాన్ని ‘మీ టూ’ పేరుతో మహిళలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్, బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, గీత రచయిత వైరముత్తులు తమను లైంగికంగా వేధించారని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులు బాధితులకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీటూ బాధితులకు మద్దతుగా నిలిచారు.

‘మహిళలతో మర్యాదగా, గౌరవంగా ఎలా ప్రవర్తించాలో ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. అలా చేయని వారికి అన్ని రంగాల్లో దారులు మూసుకుపోతుండటం సంతోషకరమైన విషయం. ఇప్పటి పరిస్థితిలో మార్పు తీసుకురావాలంటే నిజాన్ని గట్టిగా, నిర్భయంగా చెప్పాల్సిన అవసరం ఉంది’ అని రాహుల్ ఈ రోజు ట్వీట్ చేశారు.

mee to
Rahul Gandhi
Congress
support
Bollywood
  • Loading...

More Telugu News