విజయ్ దేవరకొండ సరసన ఇద్దరు కాదు ముగ్గురు భామలు!
- క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
- నిర్మాతగా కేఎస్ రామారావు
- మూడవ కథానాయికగా బ్రెజీలియన్ మోడల్
దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇప్పటివరకూ ఈ సినిమాలో రాశి ఖన్నా .. ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. మూడవ కథానాయికగా 'ఇజాబెల్లీలీట్' ఉందనేది తాజా సమాచారం. బ్రెజీలియన్ మోడల్ అయిన ఈ సుందరి, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తోంది. ఈ సినిమాతో ఆమె తొలిసారిగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. మొత్తానికి విజయ్ దేవరకొండ మాంఛి రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడన్న మాట.