kohli: కోహ్లీకి ముద్దివ్వబోయిన కడప జిల్లా యువకుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-c65962fb1e41c91869d8e29314e2afafca162d4f.jpg)
- ఉప్పల్ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ ల మధ్య రెండో టెస్టు
- మైదానంలోకి దూసుకొచ్చిన యువకుడు
- అభిమానితో సెల్ఫీ దిగిన కోహ్లీ
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికి ఒక అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. కోహ్లీని హత్తుకుని, ముద్దు పెట్టుకోవడానికి యత్నించాడు. ఈ సందర్భంగా ఆ యువకుడితో సెల్ఫీ దిగాడు కోహ్లీ.
అయితే, జరిగిన ఘటనతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా సదరు యువకుడి పేరు అహ్మద్ ఖాన్ (20) అని, కడప జిల్లాకు చెందిన వ్యక్తి అని గుర్తించారు. అయితే, కేవలం కోహ్లీ మీద ఉన్న అభిమానంతోనే అతను మైదానంలోకి వెళ్లినట్టు పోలీసులు తెలిపారు.