somireddy chandramohanreddy: విజయసాయిరెడ్డి డైరెక్షన్‌... మోదీ యాక్షన్‌ : మంత్రి సోమిరెడ్డి మండిపాటు

  • సీఎం రమేష్‌పై ఆదాయ పన్ను శాఖ దాడుల రహస్యం ఇదే
  • తమ వ్యతిరేకులపై కక్ష సాధింపులో భాగంగానే ఐటీ వేధింపులు
  • కేంద్రం తీరు ఎమర్జెన్సీని తలపిస్తోంది

ప్రధాన మంత్రి కార్యాలయంలో తిష్టవేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డైరెక్షన్‌ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో పలువురు నాయకులపై ఆదాయ పన్ను శాఖ దాడుల వెనుక రహస్యం ఇదేనని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

తమ వ్యతిరేకులపై కక్ష సాధించేందుకు వైసీపీ, బీజేపీ ఉమ్మడిగా దాడులకు వ్యూహరచన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం కేంద్రంపై పోరాడుతున్నారన్న అక్కసుతోనే సీఎం రమేష్‌పై ఐటీ వల విసురుతున్నారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేకులపై కక్ష సాధిస్తూ జైలుకు పంపుతున్నారన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తీరు చూస్తుంటే నాటి ఎమర్జెన్సీని తలపిస్తోందని, ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

somireddy chandramohanreddy
fire on BJP YSRCP
  • Loading...

More Telugu News