Telangana: మా నాన్న సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు!: కాంగ్రెస్ నేత రఘువీర్ రెడ్డి

  • 14 ఏళ్లుగా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉన్నా
  • వన్ ఫ్యామిలీ-వన్ టికెట్ అని హైకమాండ్ చెప్పలేదు
  • నల్గొండలో మీడియాతో మాట్లాడిన రఘువీర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో తాను 2004 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నానని సీనియర్ నేత మాజీ హోంమంత్రి జానా రెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి తెలిపారు. ఓ కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గతంలో ఎన్నడూ చెప్పలేదని వెల్లడించారు. ఈసారి కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన  మాట్లాడారు.

తన తండ్రి కె.జానారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని రఘువీర్ రెడ్డి తెలిపారు. తన తండ్రి సీఎం కావడం కన్నా ఇంకేం కావాలని వ్యాఖ్యానించారు. ఈసారి కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Telangana
Jana Reddy
raghuveer reddy
Congress
Chief Minister
one family one ticket
  • Loading...

More Telugu News