sekhar kammula: కొత్త హీరోతోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీ

  • 'ఫిదా'తో హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల 
  • తదుపరి సినిమాకి సన్నాహాలు 
  • నిర్మాతగా ఏషియన్ సునీల్

యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. ఫ్యామిలీ ఎమోషన్స్ కు అందమైన ప్రేమకథను ముడిపెడుతూ తెరపై ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. అందుకు ఉదాహరణగా 'ఫిదా' సినిమాను గురించి చెప్పుకోవచ్చు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ వెంటనే సెట్స్ పైకి వెళ్లకుండా మరింత జాగ్రత్త తీసుకుని ఆయన మరో కథను రెడీ చేసుకున్నాడు.

ఈ కథకి కథానాయకుడు కొత్త కుర్రాడు అయితే బాగుంటుందని భావించిన ఆయన, ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. హీరోను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయిందనీ .. త్వరలోనే ఆ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక కథానాయిక విషయంలో కూడా క్లారిటీ రావలసి వుంది. ఏషియన్ సునీల్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడట. మొత్తానికి శేఖర్ కమ్ముల .. నిఖిల్ మాదిరిగా మరో హీరోను పరిచయం చేయనున్నాడన్న మాట.  

sekhar kammula
  • Loading...

More Telugu News