Jana Sena: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్, నాదెండ్ల మనోహర్!

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసన సభాపతి
  • గత కొంతకాలంగా ఆయన పార్టీ మారుతారన్న ఊహగానాలు
  • పవన్‌ కల్యాణ్‌తో కలిసి తిరుమల ప్రయాణం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అసెంబ్లీ మాజీ స్పీకర్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ శుక్రవారం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా  కాంగ్రెస్‌ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్న మనోహర్.. నిన్న కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.

ఈ రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి మనోహర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పవన్‌కల్యాణ్‌, మనోహర్‌ ఆలయానికి చేరుకుని స్వామి వారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Jana Sena
nadendla manohar
Pawan Kalyan
  • Loading...

More Telugu News