Costal Area: తీరంలో మాటేసిన ఉగ్రవాదులు... హెచ్చరికలతో నేవీ, కోస్ట్ గార్డ్ అలర్ట్!
- లష్కరే తోయిబా ఉగ్రవాదుల కుట్ర
- హెచ్చరించిన నిఘా వర్గాలు
- తీరంలో భద్రత పెంపు
భారత సముద్ర తీర ప్రాంతాల్లో మాటేసిన పాక్ ఉగ్రవాదులు, పోర్టులు, చమురు నౌకలు, రవాణా నౌకలపై దాడులు చేయవచ్చంటూ నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో, నేవీ, కోస్ట్ గార్డ్ అలర్టయ్యాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని ఐబీ ఉప్పందించడంతో, దాదాపు 7,515 కిలోమీటర్ల తీరంలో భద్రతా దళాలు పహారాను పెంచి డేగ కళ్లతో నిఘా వేశాయి.
జైషే మహమ్మద్ సముందరీ జీహాద్ పేరిట లష్కరే ఉగ్రవాదులు దాడులకు దిగవచ్చని సమాచారం అందినట్టు ఉన్నతాధికారులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఆ వెంటనే తీర రక్షక దళం అప్రమత్తమై కొచ్చి, ముంబై, విశాఖ తీర ప్రాంతాలతో పాటు పాకిస్థాన్ కు దగ్గరగా ఉండే గుజరాత్ తీరంలో భద్రతను పెంచారు.