Nara Lokesh: ఒక్క పులివెందుల విషయంలోనే నాకు డౌట్: నారా లోకేశ్ చమత్కారం

  • ప్రతిపక్షం స్థాయిని దిగజార్చిన జగన్
  • ఆరోపణల్లో ఒక్కటైనా రుజువు చేశారా?
  • న్యూఢిల్లీలో మీడియాతో లోకేశ్

వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ పడే ఒక్క పులివెందుల మినహా మిగతా అన్ని చోట్లా విజయం తమదేనని నారా లోకేశ్ చమత్కరించారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, "ఒక్క పులివెందుల విషయంలోనే కొంచెం డౌట్‌" అని అన్నారు.

ప్రతిపక్షం స్థాయిని దిగజార్చిన నేత ఒక్క వైఎస్ జగనేనని, ఆయన మాటలకు విలువ లేకుండా పోయిందని వ్యాఖ్యానించిన లోకేశ్, జగన్ చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపితం కాలేదని అన్నారు. ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేసే ఓపిక కూడా తమకు నశించిందని చెప్పారు. వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో మకాం వేసే జగన్ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.

Nara Lokesh
Jagan
Pulivendula
  • Loading...

More Telugu News