p vijaya reddy: మంత్రిగా ఉండి ఏమీ చేయలేని వ్యక్తి ఇప్పుడేం చేస్తారు?: దానంపై విమర్శలు గుప్పించిన పీజేఆర్ కుమార్తె

  • గతంలో మంత్రులుగా పని చేసి ప్రజలకు ఏమీ చేయలేదు
  • ఖైరతాబాద్ టికెట్ విషయంలో అయోమయం సృష్టిస్తున్నారు
  • కేసీఆర్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది

గతంలో మంత్రిగా పని చేసి కూడా ప్రజలకు ఏమీ చేయలేని వ్యక్తులు ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరి, కార్యకర్తల్లో అమోమయం సృష్టిస్తున్నారంటూ దానం నాగేందర్ పై పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి విమర్శలు గుప్పించారు. టికెట్ విషయంలో కార్యకర్తలు అయోమయానికి గురయ్యేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలో మంత్రులుగా ఉండి ప్రజలకు ఏమీ చేయలేదని... అలాంటి వారిని జనాలు ఎలా నమ్ముతారని అన్నారు. ప్రజల్లో ఉండి పని చేసే వారికే టికెట్ ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని... ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. దమ్ముంటే ఇతర పార్టీల నుంచి కార్యకర్తలను తీసుకొచ్చి టీఆర్ఎస్ ను బలోపేతం చేయాలని సవాల్ విసిరారు. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం టికెట్ గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని చెప్పారు.

p vijaya reddy
pjr
kct
danam nagender
TRS
khairatabad
  • Loading...

More Telugu News