Hyderabad: సందడిగా మారిన ఉప్పల్ పరిసరాలు... నేటి నుంచి రెండో టెస్టు!

  • ఉదయం 9.30 నుంచి వెస్టిండీస్ తో టెస్టు
  • తొలి టెస్టును గెలిచిన ఊపుమీదున్న ఇండియా
  • కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు

మరికాసేపట్లో హైదరాబాద్, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ తో భారత్ తన రెండో టెస్టు మ్యాచ్ ని ఆడనుంది. ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా తిలకించేందుకు స్టేడియానికి వస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ తో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది. ఇప్పటికే వెస్టిండీస్ తో రాజ్ కోట్ లో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించి ఊపుమీదున్న భారత్, రెండో మ్యాచ్ ని కూడా గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉండగా, తమ సత్తా చాటి భారత్ కు షాకివ్వాలని విండీస్ భావిస్తోంది.

 ఐదు రోజుల పాటు మ్యాచ్ జరగనుండగా, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అభిమానులు ఒక్క మొబైల్ ఫోన్లు మినహా మరేమీ తీసుకు రావడానికి వీల్లేదన్న ఆదేశాలు జారీ అయ్యాయి. స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య తక్కువగా ఉంటే, స్కూలు పిల్లలను తరలించేందుకు హెచ్సీఏ ఏర్పాట్లు చేసింది. ఈ మ్యాచ్ ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం కానుంది.

Hyderabad
Cricket
India
Uppal
Rajiv Gandhi International Cricket Stadium
West Indees
  • Loading...

More Telugu News