IRCTC: షుగర్ వ్యాధిగ్రస్తులకు రైళ్లలో ప్రత్యేక భోజనం: ఐఆర్సీటీసీ

  • 'ఫుడ్ ఆన్ ట్రాక్' యాప్ లో లభ్యం
  • నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాం
  • ట్విట్టర్ లో పేర్కొన్న ఐఆర్సీటీసీ

 మధుమేహ వ్యాధిగ్రస్తులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్తను అందించింది. ఇకపై రైళ్లలో దూర ప్రయాణాలు చేసే షుగర్ రోగులకు ప్రత్యేక భోజన సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ (ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) స్వయంగా వెల్లడించింది. తాము అందిస్తున్న 'ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌' యాప్‌ ను వాడుకుని నాణ్యమైన ఆహార పదార్థాలను అందుకోవచ్చని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. మధుమేహ వ్యాధి ఉన్నవారు, తమ శరీరంలోని షుగర్ లెవల్స్ కు అనుగుణంగా ఆహారాన్ని తినాల్సి ఉంటుందని గుర్తు చేసిన ఐఆర్సీటీసీ, ఇటువంటి వారి కోసం ప్రత్యేక భోజనాన్ని అందిస్తామని తెలియజేసింది.

  • Loading...

More Telugu News