Rana Daggubati: రానా హోస్ట్‌గా ‘నెం 1 యారీ' సీజన్ 2

  • సక్సెస్ అయిన సీజన్ 1
  • ఫేస్‌బుక్ లైవ్ ఇచ్చిన రానా
  • హోస్టింగ్ చాలా ఛాలెంజింగ్

'నెం 1 యారి' సీజన్ 2 త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రానా తాజాగా ఫేస్‌బుక్ లైవ్ ఇచ్చారు. సీజన్ 2లో తన పర్సనల్ ప్లేస్‌లో సెట్ వేయనున్నారని తెలిపారు. సీజన్ 1 సారధి స్టూడియోస్‌లో జరిగిందని తెలిపారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోలను ప్రదర్శించారు.

ప్రతి ఆదివారం రాత్రి 8:30కి ఈ షో ప్రసారమవుతుందని తెలిపారు. సీజన్ 1 సక్సెస్ అవడంతో సీజన్ 2కి ఆనందంగా ఒప్పుకున్నానని రానా తెలిపారు. ‘హాయిగా సరదాగా ఆదివారం కొన్ని కబుర్లు చెబుతాను. మా యారీలను కూడా తీసుకొచ్చి కబుర్లు చెప్పిస్తా’ అని రానా అన్నారు. ప్రతి నిమిషం అలెర్ట్‌గా ఉండాలి కాబట్టి హోస్టింగ్ చాలా ఛాలెంజింగ్ అని రానా తెలిపారు.

Rana Daggubati
Saradhi Studios
Season 2
  • Loading...

More Telugu News