vijay devarakonda: విజయ్ దేవరకొండ మూవీలో ఇద్దరు హీరోయిన్లు

- క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
- కథానాయికలుగా రాశి ఖన్నా - ఐశ్వర్య రాజేశ్
- త్వరలోనే సెట్స్ పైకి
విజయ్ దేవరకొండ నుంచి 'టాక్సీవాలా' సినిమా రావలసి ఉండగా, 'డియర్ కామ్రేడ్' సెట్స్ పై వుంది. ఈ రెండు సినిమాలు కంటెంట్ పరంగా విభిన్నమైనవే కావడంతో, అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక మరో సినిమా చేయడానికి కూడా విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో .. కె.ఎస్.రామారావు నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుంది.
