kodandaram: మహాకూటమి సమావేశం చాయ్ తాగి పోయేందుకే పరిమితమవుతోంది: కోదండరామ్
- సీట్ల పంపకాలను త్వరగా తేల్చేయాలి
- సాగదీస్తూ పోతే పరిస్థితులు బలహీనపడతాయి
- పొత్తులను సీట్ల కోణంలో చూడరాదు
మహాకూటమిలో సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు ఎటూ తేల్చకపోవడంపై టీజేఎస్ అధినేత కోదండరామ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మహాకూటమి సమావేశాలు చాయి తాగి పోయేందుకే పరిమితమవుతున్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. సీట్ల పంపకాలపై త్వరగా తేల్చి, ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కోరుతున్నారు.
సాగదీస్తూ పోతే పరిస్థితులు బలహీనపడతాయని ఆయన అంటున్నారు. ఉమ్మడి అజెండాను ప్రకటిస్తే... దాన్ని ప్రజల్లో చర్చకు పెట్టే అవకాశం లభిస్తుందని, పొత్తులను సీట్ల కోణంలో చూడరాదని కోదండరామ్ చెబుతున్నట్టు సమాచారం. ఉమ్మడి ప్రయోజనాల కోసం సీట్ల పంపకాలను త్వరగా పూర్తి చేయాలని, మహాకూటమి కొనసాగాలన్నదే తమ అభిమతమని ఆయన అంటున్నట్టు తెలుస్తోంది.