Donald Trump: అమెరికా ఆంక్షలు రష్యా-భారత్ ఒప్పందంపై ప్రభావాన్ని చూపలేవు: రష్యా రాయబారి

  • భారత పర్యటన సందర్భంగా మోదీ, పుతిన్ లు పలు విషయాలపై చర్చించారు
  • వాణిజ్య సంబంధాలను కాపాడుకోవడంపై కూడా చర్చించారు
  • ఆంక్షలకు సంబంధించి ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన రష్యా రాయబారి

ఇండియాపై అమెరికా విధించాలనుకుంటున్న ఆంక్షలు భారత్-రష్యాల మధ్య ఉన్న రక్షణ ఒప్పందాలపై ప్రభావం చూపలేవని ఇండియాలో రష్యా రాయబారి నికోలే కుదాషెవ్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో పలు విషయాలపై చర్చించారని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి ప్రాధాన్యత అంశాలపై ఇరువురు నేతలు చర్చించారని... ఒకవేళ అమెరికా ఆంక్షలు విధిస్తే... ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఏం చేయాలనే అంశంపై కూడా చర్చించారని తెలిపారు.

ఆంక్షలకు సంబంధించి తాము ఏ నిర్ణయం తీసుకుంటామో ఇండియా త్వరలోనే తెలుసుకుంటుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నికోలే పైవిధంగా స్పందించారు.

Donald Trump
putin
modi
sanctions
defence
deal
  • Loading...

More Telugu News