Salman Khan: నేనే కొట్టుంటే ఐశ్వర్యారాయ్ బతికుండేదే కాదు!: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

  • సల్మాన్ తనను తీవ్రంగా హింసించాడన్న ఐశ్వర్యారాయ్
  • నేను బలంగా కొడితే ఓ టేబుల్ విరిగిపోయిందన్న సల్మాన్
  • అదే దెబ్బ తగిలుంటే, ఆమె బతికుండేది కాదని వ్యాఖ్య

'మీటూ' ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన వేళ, తన మాజీ ప్రియుడు, సహ నటుడు అయిన సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ ఐశ్వర్యా రాయ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్న వేళ, సల్మాన్ ఖాన్ మాట్లాడిన ఓ వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ అవుతోంది. సల్మాన్ తనను తీవ్రంగా హింసించాడని, ఆయన కొట్టిన దెబ్బల కారణంగా తన శరీరంపై మచ్చలు ఏర్పడకపోవడం తన అదృష్టమని ఐశ్వర్య వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ) జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు సల్మాన్ సమాధానం ఇస్తూ, "అవును. ఇదే ప్రశ్న గతంలో జర్నలిస్టు ప్రభు చావ్లా చానాళ్ల క్రితమే అడిగింది. ఆ సమయంలో నాకు కోపం వచ్చి టేబుల్ పై గట్టిగా కొట్టాను. అది నిజంగా విరిగిపోయింది. అంటే నేను ఎవరినైనా కొడితే, అది కోపంతోనే జరుగుతుంది. నా దెబ్బ బలంగా ఉంటుంది. అంటే ఆమె బతికుండేది కాదు" అని అన్నాడు. సల్మాన్ వీడియో వైరల్ అవుతుండగా, ఆయన నిర్లక్ష్య పూరిత సమాధానం చెప్పాడని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Salman Khan
Aishwarya Rai
Metoo
  • Error fetching data: Network response was not ok

More Telugu News