Congress: పొన్నాలపై కాంగ్రెస్ శ్రేణుల తిరుగుబాటు..75 ఏళ్ల వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దని ఆందోళన!

  • గాంధీభవన్ ముందు జనగామ నేతల ధర్నా
  • పార్టీని ఇన్ని రోజులు పట్టించుకోలేదని విమర్ళ
  • టికెట్ ఇస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతామని స్పష్టీకరణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీల్లోనూ అసంతృప్త జ్వాలలు చెలరేగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని కోరుతూ పలువురు నేతలు ఆందోళనకు దిగారు. గాంధీభవన్ వద్దకు చేరుకుని పోన్నాలకు టికెట్ ఇవ్వొద్దంటూ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. గత నాలుగేళ్లుగా పొన్నాల నియోజకవర్గంలో కార్యకర్తలను, పార్టీని పట్టించుకోలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి ఆరోపించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికే టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీ తో గెలిచే అవకాశం ఉందన్నారు. 75 ఏళ్ల వయసున్న పొన్నాలకు టికెట్ ఇవ్వొద్దనీ, ఆయన కారణంగా పార్టీ నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గాంధీ భవన్ ముందు నిర్వహించిన ఆందోళనలో జనగామ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వేమళ్ల సత్యనారాయణ రెడ్డితో పాటు పలువురు తాజా మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Congress
Telangana
Ponnala Lakshmaiah
Congress PARTY WORKERS
OPPOSING
PARTY TICKET
JANAGAMA
  • Loading...

More Telugu News