Chandrababu: నేడు ఎదురెదురుగా తారసపడ్డ చంద్రబాబు, పవన్ కల్యాణ్!

  • ఈ ఉదయం విజయవాడలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కుమారుడి నిశ్చితార్థం
  • హాజరైన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్
  • చిరునవ్వుతో పలకరించుకున్న నేతలు

ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం ఎదురెదురుగా తారసపడ్డారు. ఇద్దరి మధ్యా చిరునవ్వులు, పలకరింపులు చోటు చేసుకున్నాయి. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కుమారుడి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

నాలుగున్నరేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్, ఆపై మారిన పరిస్థితుల నేపథ్యంలో, టీడీపీతో విభేదించిన సంగతి తెలిసిందే. ఆపై వీరిద్దరూ, అమరావతి ప్రాంతంలో జరిగిన ఓ ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత టీడీపీపై పవన్, తన విమర్శల ధాటిని పెంచారు కూడా. ఈ నేపథ్యంలో మరోమారు వీరిద్దరూ కలుసుకోవడం ఆసక్తిని రేకెత్తించింది.

Chandrababu
Pawan Kalyan
Tota Trimurthulu
Engagement
  • Loading...

More Telugu News