america: నా నిర్ణయం ఏమిటనేది త్వరలోనే ఇండియా తెలుసుకుంటుంది: ట్రంప్

  • రష్యాతో ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఒప్పందం చేసుకున్న ఇండియా
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమెరికా
  • కాస్టా చట్టం కింద భారత్ పై ఆంక్షలు విధించే అవకాశం

రష్యాతో ఇటీవల 5 బిలియన్ డాలర్ల విలువైన అత్యంత శక్తిమంతమైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం ఒప్పందాన్ని ఇండియా చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ రష్యాతో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విషయంలో ఇండియాపై అమెరికా ఆగ్రహంగా ఉంది.

 ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఇండియాపై విధించబోయే ఆంక్షలకు సంబంధించి... తాము తీసుకోబోయే నిర్ణయం ఏమిటనేది త్వరలోనే ఆ దేశం తెలుసుకుంటుంది అని చెప్పారు. కాట్సా (CAATSA) చట్టం ప్రకారం ఇతర దేశాలపై ఆంక్షలను విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు కలిగి ఉంటాడు. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఎస్-400 డిఫెన్స్ సిస్టంపై ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. రష్యాతో ఇలాంటి ఒప్పందాన్నే చేసుకున్నందుకు చైనాపై అమెరికా ఇటీవలే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News