Viral Videos: తండ్రీకూతుర్ల మధ్య అనుబంధమంటే ఇదే... ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో ఇది!

  • తండ్రీ బిడ్డల మధ్య అనుబంధానికి ఉదాహరణ
  • తండ్రి పాడుతున్న పాటకు బిడ్డ లిప్ సింకింగ్
  • అలరిస్తూ, దూసుకెళుతున్న వైరల్ వీడియో

తండ్రీ బిడ్డల మధ్య ఉండే అనుబంధానికి ఇది మరో ఉదాహరణ. కుమార్తెకు తొలి ప్రేమ తండ్రిపై కలుగుతుందని, కుమారుడికి తన తండ్రే సూపర్ హీరో అని చెప్పే వ్యాఖ్యలను నిజమని చూపుతున్న వీడియో ఇది. తన గారాల బిడ్డను ఎత్తుకున్న ఓ తండ్రి, 'గార్ల్స్ లైక్ యూ' అనే 'మరాన్-5' బాండ్ సాంగ్ ను పాడుతుంటే, ఆ బిడ్డ లిప్ సింకింగ్ చేసిన విధానం నెటిజన్లను అలరిస్తూ, సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది.

కనీసం నడవటం కూడా చేతగాని ఆ పాప, తన తండ్రి ఎలాగైతే పెదవులను కదుపుతున్నాడో, అచ్చం అలాగే చేసింది. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియకపోయినా, ఈ వీడియోను చూసిన వారంతా, ఆ తండ్రీ బిడ్డలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News