adithi mittal: ఆ హాస్య నటి నన్ను బలవంతంగా ముద్దుపెట్టుకుంది.. క్షమాపణ చెప్పాలి!: మరో హాస్యనటి డిమాండ్

  • రెండేళ్ల క్రితం ఆమె నన్ను వేధించింది
  • అంధేరి బేస్‌లో ఓ కామెడీ షో చేస్తుండగా నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకుంది
  • నాకు ఏం చేయాలో అర్థంకాక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యాను

హాస్యనటి అదితి మిట్టల్‌కు మరో హాస్యనటి కనీజ్‌ సుర్ఖా షాక్‌ ఇచ్చింది. రెండేళ్ల క్రితం తన పట్ల ఆమె అర్థంకాని రీతిలో వ్యవహరించి తీవ్ర మానసిక సంఘర్షణకు గురిచేసిందని, ఆనాటి తన తప్పును తెలుసుకుని నాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. ఆ తర్వాతే ఆమె మీటూ ఉద్యమానికి మద్దతు గురించి మాట్లాడాలంది.

'ఆ రోజు అంధేరి బేస్‌లో కామెడీ షో చేస్తుండగా అదితి వచ్చి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకుంది. అక్కడ దాదాపు వంద మంది ప్రేక్షకులు ఉన్నారు. ఆ క్షణంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడాది క్రితం కలిసినప్పుడు క్షమాపణ కోరితే సరే అంటూ మరోసారి ఇబ్బంది పెట్టాలని చూసింది. అందుకే బహిరంగ క్షమాపణ కోరుతున్నాను’ అని కనీజ్‌ స్పష్టం చేసింది.

‘ఉద్యమానికి సపోర్టు చేస్తానన్న అదితి ముందు తాను చేసిన తప్పు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆనాటి ఈ సంఘటనను నేను బయటపెడుతున్నాను. అంతే తప్ప ఇది ప్రతీకార చర్య కాదు’ అని కనీజ్‌ స్పష్టం చేశారు. దీన్ని ఆధారం చేసుకుని మీ సొంత అజెండా అమలు చేయాలని మాత్రం ప్రయత్నించకండి అంటూ వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పురుషులకు ట్విట్టర్‌లో చురకంటించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News