Aravinda Sametha: 'అరవింద సమేత' సూపర్ హిట్టంటూ అభిమానుల సంబరాలు... స్క్రీన్ షాట్లతో హోరెత్తుతున్న సోషల్ మీడియా!

  • ఈ ఉదయం విడుదలైన 'అరవింద సమేత'
  • పాజిటివ్ రివ్యూలను ఇస్తున్న క్రిటిక్స్
  • 'సింహాద్రి'ని మించిపోయిందంటున్న ఫ్యాన్స్

ఎన్టీఆర్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన 'అరవింద సమేత' ఈ ఉదయం విడుదలైంది. ఈ చిత్రానికి అటు అభిమానుల నుంచి, ఇటు రివ్యూల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని నందమూరి ఫ్యాన్స్ థియేటర్ స్క్రీన్ షాట్లను పెడుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మరికొందరైతే సినిమాలోని కొన్ని దృశ్యాలను చిత్రీకరించి వాటిని పంచుకుని, తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

సినిమాలో వినోదం కొంత తక్కువైందని, అక్కడక్కడా హింస ఎక్కువగా ఉందన్న కామెంట్లు వినిపిస్తున్నా, ఈ సినిమా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ 'సింహాద్రి'ని మించిపోయిందని, 'జై లవకుశ' తరువాత ఎన్టీఆర్ కు మరో హిట్ ను అందించిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిత్రంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి తన సత్తాను చాటాడని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ట్వీట్లను మీరూ చూడవచ్చు.

Aravinda Sametha
NTR
Trivikram Srinivas
Movie
Fans
Social Media
  • Loading...

More Telugu News