Khammam District: ఈసీ వేటు... ఉమ్మడి ఖమ్మంలో ఏడుగురిపై ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు!

  • 2020 వరకూ పోటీ చేయకుండా ఆదేశాలు
  • ఎన్నికల నిబంధనల్లో సెక్షన్ 10 ఏ ప్రకారం అనర్హులు
  • ఉత్తర్వులు వెలువరించిన ఎన్నికల కమిషన్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడుగురిపై అనర్హత వేటు వేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వీరిలో గత ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసిన అక్కిరాల వెంకటేశ్వర్లు, పాలేరు నుంచి పోటీ చేసిన మోతె మల్లయ్య, వైరా నుంచి బరిలోకి దిగిన బచ్చల లక్ష్మయ్య ఉన్నారు. వీరితో పాటు ఇల్లెందుకు చెందిన గుగులోతు విజయ, మినపాకకు చెందిన కొమరారం సత్యనారాయణ, కొత్తగూడెంకు చెందిన పునుగోటి సంపత్ లు కూడా ఉన్నారు. వీరంతా 2020 వరకూ ఎన్నికల్లో పోటీ పడేందుకు అనర్హులని, ఎన్నికల నిబంధనల్లోని సెక్షన్ 10ఏ, 1951 ప్రకారం వీరు అనర్హులని తెలిపింది.

Khammam District
Election Commission
  • Loading...

More Telugu News