YSRCP: తన కొంగుతో జగన్ ముఖంపై చమటను తుడుస్తున్న యువతి... అవార్డు పొందిన చిత్రం!

  • స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ పోటీ
  • జాతీయ స్థాయిలో జరిగిన ఫొటోగ్రఫీ పోటీలు
  • విజేతలకు నవంబర్ 1న బహుమతులు

జగన్ పాదయాత్ర చేస్తున్న వేళ, 'సాక్షి' దినపత్రికకు చెందిన ఫొటోగ్రాఫర్ తీసిన చిత్రమిది. తన పాదయాత్రలో అలసిపోయి, చమటపట్టిన స్థితిలో ఉన్న జగన్ ముఖాన్ని ఓ యువతి తన కొంగుతో తుడుస్తోంది. స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఈ ఫొటోకు అవార్డు లభించింది.

స్పాట్ న్యూస్, జనరల్ న్యూస్ విభాగాల్లో ఫొటోలను ఆహ్వానించిన ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్, వాటి నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసింది. అవార్డుల్లో భాగంగా తొలి, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలు, కన్సొలేషన్ బహుమతులతో పాటు ప్రత్యేకంగా శ్యాప్ ఎచీవ్ మెంట్ అవార్డులు, ఎఫ్సీఐ ఆనరబుల్ మెన్షన్ అవార్డులు అందించనున్నామని కాంటెస్ట్ చైర్మన్ టీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గెలుపొందిన విజేతలకు నవంబర్ 1న విజయవాడలో అవార్డులను అందిస్తామని అన్నారు.

YSRCP
Jagan
Girl
Photo
Award
  • Loading...

More Telugu News