Director Bobby: డైరెక్టర్ బాబీకి పాప పుట్టిందట..!

  • నా కుటుంబం కాస్త పెద్దదైంది
  • చాలా సంతోషంగా ఉంది
  • నవరాత్రుల్లో అమ్మాయి పుట్టింది

డైరెక్టర్ బాబీ(కేఎస్ రవీంద్ర)కి పాప పుట్టిందట. తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన కుటుంబం కొంచెం పెద్దదైందని వివరిస్తూ బాబీ ట్వీట్ చేశారు. ‘‘నా వరకూ చాలా సహజమైన రోజు. కానీ ఇప్పుడే అది మరచిపోలేని రోజుగా మారిపోయింది. నాకు పాప పుట్టింది. నా కుటుంబం కాస్త పెద్దదైంది. చాలా సంతోషంగా ఉంది’’ అంటూ బాబీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

బాబీ ట్వీట్‌ని చూసిన హరీష్ శంకర్ ‘శుభాకాంక్షలు బాబీ. అమ్మవారి నవరాత్రుల్లో అమ్మాయి పుట్టింది’ అని రిప్లై ఇచ్చారు. బాబీ... రవితేజతో ‘పవర్’, పవన్ కల్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలు చేశారు. అయితే ఆయనకు మంచి టర్న్ ఇచ్చిన సినిమా మాత్రం ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన ‘జై లవకుశ’. ఈ చిత్రం బాబీకే కాదు, నిర్మాతగా కల్యాణ్ రామ్‌ను కూడా నిలబెట్టింది.

Director Bobby
NTR
Pavan Kalyan
Kalyan Ram
Raviteja
Harish Shankar
  • Loading...

More Telugu News