KTR: ‘ఆగట్టునుంటావా నాగన్న..’ పాటను ప్రస్తావించిన మంత్రి కేటీఆర్

  • కాంగ్రెస్-టీడీపీలు ఒకటయ్యాయి
  • ఈ గట్టునుందామా? ఆ గట్టు నుందామా?
  • ప్రతి అన్నా, అక్కా తేల్చుకోవాల్సిన ప్రశ్న అదే

‘మహాకూటమి’ పేరిట కాంగ్రెస్-టీడీపీలు ఒకటయ్యాయని.. ప్రజలందరూ ఈ విషయమై ఆలోచించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. దేవరకొండ, మహబూబ్ నగర్ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈరోజు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, ‘రంగస్థలం’ చిత్రంలోని ‘ఆగట్టునుంటావా నాగన్న..ఈగట్టు కొస్తావా..’ పాటను ప్రస్తావించారు.

 కేటీఆర్ మాట్లాడుతూ, ‘ఈ మధ్యన ఓ సినిమా వచ్చింది.. దాని పేరు ఏదో ఉంది కానీ, ఆ సినిమాలో పాట నాకు బాగా నచ్చింది. ఆ సినిమాలో..ఊళ్లో పంచాయతీ ఎలక్షన్స్.. ఓ పాట ఉంటుంది.. ‘నాగన్న ఈ గట్టునుంటావా ఆ గట్టునుంటావా..’. ఇవాళ తెలంగాణలో ఉండే ప్రతి అన్నా, అక్కా తేల్చుకోవాల్సిన ప్రశ్న అదే. ఏ గట్టునుందాము? ఈ గట్టునుందామా? ఆ గట్టు నుందామా?’ అని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News