మోదీ నాయకత్వాన్ని ఎదుర్కొనే ధైర్యంలేకే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు: అమిత్ షా
- ఎన్నికలు 2019 ఏప్రిల్, మేలో జరగాలి
- ముందస్తు కారణంగా వందల కోట్ల భారం
- బీద, బడుగు వర్గాలపై అదనపు భారం
‘‘2018లో తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు.. వాస్తవానికి 2019 ఏప్రిల్, మేలో జరగాల్సి ఉంది. దేశంలో జరిగే లోక్‌సభ ఎన్నికలతో పాటు జరగాల్సిన ఎన్నికలను 6 నెలల ముందుకు తీసుకొచ్చి ఎన్నికలు జరిపించడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నిస్తున్నా. ఈ ఎన్నికలు ముందు జరగడం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలపై అదనపు భారం వందల కోట్లు పడుతోంది.
ఈ ప్రాంతంలో ఉండే బీద, బడుగు వర్గాల ప్రజలు అదనపు భారం మోసే ఈ ఎన్నికను ముందే ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నా. దీనికి కారణం 2019లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటే ఇబ్బందుల్లో పడతానని భయపడి కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం జరిగింది’’ అని అమిత్ షా విమర్శించారు.