ys jagan: అవినీతి విషయంలో బాబు వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు తర్ఫీదు పొందారు: వైఎస్ జగన్

  • ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు నిలబెట్టుకోలేదు
  • సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు దృష్టి సారించట్లేదు
  • 32 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైంది
  • గజపతినగరం బహిరంగ సభలో జగన్

విజయనగరం జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సీఎం చంద్రబాబు నిలబెట్టుకోలేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. విజయనగం జిల్లా గజపతినగరంలో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ జిల్లాలో సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు దృష్టి సారించడం లేదని, అవినీతికి మాత్రం పాల్పడుతున్నారని ఆరోపించారు. అవినీతి విషయంలో చంద్రబాబు వద్ద ఈ ఎమ్మెల్యేలందరూ తర్ఫీదు పొందారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విజయనగరం జిల్లాలో 32 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని, ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించలేదని, దమ్మిడీ సాయం కూడా చేయలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. వ్యవసాయం గురించి చెప్పాలంటే చంద్రబాబు హయాంలో ఒక్క ఎకరాకు కూడా అదనంగా నీరు రాకపోగా, సాగు తగ్గిపోయిందని విమర్శించారు.

ys jagan
Chandrababu
vijayanagaram
  • Loading...

More Telugu News