balakrishna: 'ఆకుచాటు పిందె తడిసె' స్టిల్ వచ్చేసింది

  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • ఎన్టీఆర్ - శ్రీదేవి హిట్ కాంబినేషన్ 
  • చెప్పుకోదగిన చిత్రంగా 'వేటగాడు'

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది. బాలకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను 'కథానాయకుడు' .. 'మహానాయకుడు' అనే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కథానాయకుడిగా ఎన్టీఆర్ .. శ్రీదేవితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ సినిమాలన్నీ కూడా ఘన విజయాలను అందుకున్నాయి. దాంతో ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో 'వేటగాడు' ఒకటిగా నిలిచింది. ఇందులోని 'ఆకుచాటు పిందె తడిసే' పాట ఎప్పటికీ ఎవర్ గ్రీనే. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ను తీసుకున్న క్రిష్, రీసెంట్ గా ఈ పాటను బాలకృష్ణ - రకుల్ పై చిత్రీకరించారు. ఈ రోజున రకుల్ పుట్టినరోజు కావడంతో, ఈ ఉదయం రకుల్ ఫస్టు లుక్ ను వదిలిన టీమ్, కొంతసేపటి క్రితం 'ఆకు చాటు పిందె తడిసే' పాటలోని స్టిల్ ను వదిలారు. నందమూరి అభిమానులను మరింత హుషారెత్తించేలా ఈ పోస్టర్ వుంది. సంక్రాంతికి ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయనున్నారు.     

  • Loading...

More Telugu News