Kollywood: మీటూ ఎఫెక్ట్.. లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించిన గీత రచయిత వైరముత్తు!

  • తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపాటు
  • ఈ విషయంపై తాను మాట్లాడబోనని వెల్లడి
  • సత్యం దానంతట అదే బయటికొస్తుందని వ్యాఖ్య

ప్రముఖ తమిళ గీత రచయిత వైరముత్తు తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళా ఆర్టిస్టులు ఆరోపించిన సంగతి తెలిసిందే. వీటిని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణలపై వైరముత్తు స్పందించారు. దేశంలోని ప్రముఖులపై తప్పుడు ఆరోపణలు చేయడం ఫ్యాషన్ గా మారిపోయిందని ఆయన విమర్శించారు. తనను కావాలని అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈరోజు వైరముత్తు ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘దేశమంతటా ప్రముఖ వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. కావాలని నన్ను అవమానిస్తున్నారు. ఈ తప్పుడు ఆరోపణల గురించి నేను స్పందించను. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది’ అని ట్వీట్ చేశారు. పెదాలపై మజ్జిగ ఉందంటూ తనను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని వైరముత్తుపై ఓ యువ గాయని ఫిర్యాదు చేసింది. దీన్ని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద బయటపెట్టారు.

Kollywood
Casting Couch
chinmayi sreepada
vairimuttu
lyrcist
  • Loading...

More Telugu News