sunil: త్రివిక్రమ్ మళ్లీ నాలో ధైర్యం నింపాడు: సునీల్

  • నాకు అన్నీ ఆయనే 
  • అందుకే ధైర్యం చేస్తాను 
  • ఆయన పట్ల నాకు నమ్మకం వుంది

చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ముందు నుంచి త్రివిక్రమ్ .. సునీల్ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. త్రివిక్రమ్ సృష్టించిన కొన్ని పాత్రలు .. సునీల్ క్రేజ్ ను మరింతగా పెంచేశాయి. హీరోగా చేస్తూ .. త్రివిక్రమ్ కి కాస్త దూరమైన సునీల్, తాజాగా 'అరవింద సమేత వీర రాఘవ'లో ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. రేపు ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా సునీల్ మాట్లాడుతూ .. త్రివిక్రమ్ తో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించాడు.

 "చిన్నప్పుడు తల్లిదండ్రులు .. ఆ తరువాత గురువులు .. తరువాత తోబుట్టువులు మంచి - చెడు చెబుతూ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంటారు. నా విషయంలో ఆ పాత్రలన్నింటినీ త్రివిక్రమ్ పోషించాడు. సినిమాల్లో నేను ధైర్యంగా ఏ వేషమైనా వేయడానికి .. ఏ ప్రయోగమైనా చేయడానికి వెనుకాడకపోవడానికి కారణం త్రివిక్రమ్. ఫైనల్ గా ఆయన నా కోసం ఒక మంచి పాత్రను క్రియేట్ చేయగలడనే నమ్మకం నాకు వుంటుంది. అలాగే అయన 'అరవింద'లో ఒక మంచి పాత్రను నా కోసం క్రియేట్ చేసి .. నాలో మళ్లీ ధైర్యాన్ని నింపాడు" అని చెప్పుకొచ్చాడు.       

  • Loading...

More Telugu News