Chennai: ఫేస్ బుక్ ప్రియురాలిపై అనుమానం... తుపాకితో ఆమెను కాల్చి తనూ ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్!

  • విల్లుపురం సమీపంలో దారుణం
  • కానిస్టేబుల్ కు పరిచయమైన మెడిసిన్ యువతి
  • పుట్టినరోజు నాడు ఆమెను చంపి, తానూ ఆత్మహత్య

ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన యువతితో పరిచయం పెంచుకున్న ఓ కానిస్టేబుల్, ఆమె మరెవరితోనో తిరుగుతోందన్న అనుమానంతో, ఆమెను కాల్చి చంపి, తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై సమీపంలోని విల్లుపురం, అన్నియూరులో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కార్తివేలు అనే యువకుడికి మెడిసిన్ చదువుతున్న సరస్వతి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో పరిచయమైంది.

ఈ క్రమంలో వారి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే, గత కొంతకాలంగా సరస్వతి తనకు దూరమవుతూ, మరెవరికో దగ్గరవుతోందన్న అనుమానం కార్తివేలులో పెరిగింది. ఈ నేపథ్యంలో సరస్వతి పుట్టిన రోజురాగా, వేడుకల్లో పాలుపంచుకునేందుకు ఆమె వద్దకు వచ్చాడు. ఆపై వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగగా, తుపాకితో సరస్వతిని కాల్చిచంపిన కార్తివేలు, ఆపై తనను తాను కాల్చుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Chennai
Tamilnadu
Conistable
Facebook
Murder
Sucide
  • Loading...

More Telugu News