aditi rao hydari: ‘కోరిక తీరిస్తే మూడు సినిమాల్లో ఛాన్స్ ఇస్తామన్నారు’.. హీరోయిన్ అదితీరావు హైదరీ!

  • ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలాకాలంగా ఉంది
  • ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నా
  • టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి

భారతీయ సినీ పరిశ్రమలో ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ లో నానాపటేకర్, గణేశ్ ఆచార్య, కోలీవుడ్ లో గేయ రచయిత వైరముత్తు, మలయాళంలో నటుడు ముఖేశ్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా వీటిపై హీరోయిన్ అదితీరావు హైదరీ స్పందించింది. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది చాలాకాలం నుంచి ఉందని వ్యాఖ్యానించింది.

కాంప్రమైజ్ అయి కోరిక తీరిస్తే 3 సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని కొందరు తనకు గతంలో ఆఫర్ చేశారని అదితీరావు చెప్పింది. కానీ అలాంటివి వద్దనుకుని తాను వచ్చేశానని వెల్లడించింది. తాను ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నాననీ, ఇలాంటి విషయాల్లో రాజీ పడబోనని తేల్చిచెప్పింది.

కొత్తవాళ్లు సినిమా పరిశ్రమలో ఎదగడం చాలా కష్టమనీ, అయితే అసాధ్యం మాత్రం కాదని స్పష్టం చేసింది. దానికి తానే ఉదాహరణ అని చెప్పింది. సినీ పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొంటామన్న విషయంపైనే కెరీర్ ఆధారపడి ఉంటుందని అదితీరావు హైదరీ చెప్పింది. టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని వెల్లడించింది.

aditi rao hydari
Casting Couch
movies
compramise
S*x
3 offers
Talking Movies
Tollywood
  • Loading...

More Telugu News