shane warne: చెప్పినట్లు బౌలింగ్ చేస్తే రూ.1.48 కోట్లు ఇస్తానన్నాడు!: ఆస్ట్రేలియా ఆటగాడు షేన్ వార్న్ సంచలన ఆరోపణలు

  • ఆత్మకథ ‘నో స్పిన్’లో వెల్లడించిన వార్న్
  • పాక్ క్రికెటర్ సలీం మాలిక్ పై ఆరోపణలు
  • వైవాహిక జీవితం గురించి ప్రస్తావన

ఆస్ట్రేలియన్ టాప్ బౌలర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఆత్మకథ ‘నో స్పిన్’లో పలు సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. మాజీ కెప్టెన్ స్టీవ్ వా పక్కా స్వార్థ పరుడని వార్న్ తన ఆత్మకథలో ఆరోపించారు. తాజాగా ఈ స్పిన్ దిగ్గజం సంచలన ఆరోపణలు చేశాడు. వికెట్లకు అవతల బంతులు విసిరితే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని తనకు కొందరు ఆశపెట్టారని చెప్పాడు.

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సలీం మాలిక్ ఈ బాగోతానికి తెరతీశాడని వార్న్ తెలిపాడు.1994-95 సీజన్ లో కరాచీలో జరిగిన ఆస్ట్రేలియా-పాక్ టెస్టు సిరీస్ సందర్భంగా మాలిక్ తనతో మాట్లాడాడన్నారు. ఆఫ్ స్టంప్ వైపు బంతులు వేయాలనీ, అలా చేస్తే 2 లక్షల డాలర్లు(రూ.1.48 కోట్లు) ఇస్తానని సలీం మాలిక్ ఆఫర్ చేశాడన్నారు.


అంతేకాకుండా ఇంకోసారి ఓ బుకీ తనతో బేరం చేసేందుకు యత్నించాడన్నారు. వీటన్నింటినీ తాను తిరస్కరించానని వెల్లడించారు. తన వైవాహిక జీవితంలో జరిగిన ఘటనలను కూడా వార్న్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఇద్దరు భార్యలు సిమోన్, ఎలిజబెత్ హార్లీతో విడిపోయినప్పటికీ తామంతా మంచి స్నేహితులమేనని చెప్పాడు. వార్న్ 2005లో వన్డేల నుంచి, 2007లో టెస్టుల నుంచి తప్పుకున్నాడు.

shane warne
Australia
Cricket
salim malik
bribr
  • Loading...

More Telugu News