Flora Saini: గౌరంగ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సినిమాను వదులుకున్న ఐశ్వర్యారాయ్!

  • గౌరంగ్ వేధించాడని చెప్పిన ఫ్లోరా షైనీ
  • విషయం తెలుసుకున్న ఐశ్వర్య అండగా నిలిచింది
  • ఆ సినిమా నుంచి ఆమె తప్పుకుందన్న ఫ్లోరా

చానాళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యా రాయ్, నిర్మాత గౌరంగ్ దోషి లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా, ఆయన తలపెట్టిన ఓ సినిమా నుంచి తప్పుకుందట. ఈ విషయాన్ని నటి ఫ్లోరా శైనీ (ఆశా షైనీ) ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. తనను గౌరంగ్ వేధించాడని, కొట్టాడని తెలుసుకున్న ఐశ్వర్య, తనకు అండగా నిలిచిందని, గౌరంగ్ చర్యలను వ్యతిరేకిస్తూ, ప్రాజెక్టు నుంచి తప్పుకుందని వెల్లడించింది. గౌరంగ్ పై ఫ్లోరా షైనీ సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఆయన్ను ప్రేమించానని, తనను లైంగికంగా వేధించడంతో పాటు దారుణంగా హింసించాడని వాపోయింది. 

Flora Saini
Gourand
Aishwarya Rai
Harrasment
  • Loading...

More Telugu News