kollywood: పెదాలపై మజ్జిగ ఉందంటూ బలవంతంగా ముద్దు పెట్టాడు!: గీత రచయిత వైరముత్తుపై మహిళా సింగర్ ఆరోపణ!

  • కోలీవుడ్ లో ‘మీటూ’ ఉద్యమం
  • బయటపెట్టిన సింగర్ చిన్మయి
  • స్పందించని గేయ రచయిత

హాలీవుడ్ లో మొదలైన ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు బాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఇప్పుడు కోలీవుడ్ కు పాకాయి. తమను ఫలానా వారు లైంగికంగా వేధించారంటూ చాలామంది నటీమణులు, ఆర్టిస్టులు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో గీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తు పెను వివాదంలో చిక్కుకున్నారు. వైరముత్తు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళా గాయని బయటపెట్టారు.

తాను చెన్నైలోని బీసెంట్ నగర్ లో ఉన్న వైరముత్తు ఇంటికి ఓరోజు వెళ్లానని ఆమె తెలిపారు ‘‘అప్పుడు తాగటానికి నాకు వైరముత్తు మజ్జిగ ఇచ్చాడు. నేను అది తాగుతుండగానే ‘నీ పెదాలపై కొంచెం మజ్జిగ అంటుకుని ఉంది’ అంటూ ముందుకొచ్చి ముద్దు పెట్టేశాడు. అది నా జీవితంలో జరిగిన చేదు అనుభవం’’ అని బాధితురాలు చెప్పింది.

ఈ విషయాన్ని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదే కాకుండా వైరముత్తు నడుపుతున్న హాస్టల్ లో తమను లైంగికంగా వేధించాడని బాధితులు పంపిన మెసేజ్ స్క్రీన్ షాట్లను పోస్టులకు జత చేసింది. కాగా, ఈ వివాదంపై వైరముత్తు ఇంతవరకూ స్పందించలేదు.

kollywood
me too
sexual harrasment
woman singer
viramuttu
  • Loading...

More Telugu News