Sun: ఎండ మంటలు... హైదరాబాద్ లో మూడేళ్ల గరిష్ఠానికి ఉష్ణోగ్రత!

  • అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు 
  • 34.2 డిగ్రీలకు హైదరాబాద్ ఉష్ణోగ్రత
  • 35 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం

అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రత హైదరాబాదీలను ఉక్కపోతకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేకపోవడం, ఆకాశంలో మేఘాలు సైతం కనిపించకపోవడంతో, సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతూ వేసవిని గుర్తు చేస్తున్నాయి. గత మూడేళ్లలో అక్టోబర్ నెలలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది.

మంగళవారం నాడు రికార్డు స్థాయిలో 34.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, సాధారణం కన్నా ఇది 3 డిగ్రీల వరకూ అధికమని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకూ చేరవచ్చని అంచనా వేసిన అధికారులు, దీని ప్రభావంతో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురవవచ్చని వెల్లడించారు. కాగా, 2016 అక్టోబర్ లో 33.4 డిగ్రీలు, 2017లో 33.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు అక్టోబర్ లో నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News