Karnataka: అమావాస్య నాడు నరబలి కలకలం.. ఆరేళ్ల పిల్లాడి హత్య!

  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • నరబలి ఇచ్చిన భవన కార్మికుడు
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

మూఢనమ్మకాలు మనుషులను జంతువుల కంటే హీనంగా మార్చేస్తున్నాయి. తాజాగా అమావాస్య నాడు పిల్లాడిని బలి ఇస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఓ దుండగుడు ఆరేళ్ల పిల్లాడిని దారుణంగా హత్యచేశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో ఉన్న భీమణ్ణ గార్డెన్ లో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇక్కడి గార్డెన్ లో ఆర్ముగం (30) అనే వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పొరుగింటిలో ఉన్న సామ్ వీర్(6) అనే బాలుడిని చాక్లెట్లు ఇప్పిస్తానని రాత్రిపూట ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం అతని తలపై రాయితో మోది కిరాతకంగా హత్యచేశాడు.

మహాలయ అమావాస్య కావడంతో నరబలి ఇస్తే మంచిదన్న విశ్వాసంతో ఆర్ముగం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ నేపథ్యంలో సామ్ వీర్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News