trivikram: నాకు సినిమా స్క్రిప్ట్‌ రాయడమే బద్ధకం.. ఇక పవన్ ప్రసంగాలు నేనెలా రాస్తాను?: త్రివిక్రమ్

  • హరికృష్ణ మృతితో షూటింగ్ ఆపాలనుకున్నాం
  • కానీ ఎన్టీఆర్ చొరవతో సినిమా పూర్తయింది
  • రేపు విడుదల కానున్న అరవింద సమేత

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజాహెగ్డే జంటగా ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాను దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షన్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పలు అంశాలపై త్రివిక్రమ్ మీడియాతో ముచ్చటించారు. హరికృష్ణ చనిపోవడంతో సినిమాను ఏప్రిల్ లేదా మే లో రిలీజ్ చేద్దామని అనుకున్నామని త్రివిక్రమ్ చెప్పారు. అయితే కార్యక్రమాలు జరిగిన రెండో రోజే ఎన్టీఆర్ ఫోన్ చేసి ‘మనం సినిమాను 11న విడుదల చేస్తున్నాం’ అని చెప్పాడన్నారు.

ఇక పవన్ గురించి చెబుతూ.. అన్నయ్య చిరంజీవి, అమ్మ అంజనీదేవికి చెప్పకుండానే ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయాడని త్రివిక్రమ్ అన్నారు. ఆ విషయాన్ని తాను కూడా పేపర్లోనే చదివి తెలుసుకున్నానని చెప్పారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రసంగాలు తానే రాసిపెడతానన్న వార్తలను త్రివిక్రమ్ ఖండించారు. తనకు సినిమా స్క్రిప్ట్ రాయడానికే బద్ధకమనీ, ఇక తాను రాజకీయ ప్రసంగాలు ఎక్కడ రాయగలనని ప్రశ్నించారు.

trivikram
aravinda sameta
puja hegde
Pawan Kalyan
ntr
political speaches
scripts
  • Loading...

More Telugu News