Kodandaram: కోదండరామ్ మడతపేచీ... కాంగ్రెస్ కు 48 గంటల డెడ్ లైన్!

  • గురువారం సాయంత్రం వరకూ డెడ్ లైన్
  • కోరుకుంటున్నది 19 సీట్లే
  • స్పష్టత ఇవ్వకుంటే 21 మందితో తొలి జాబితా
  • హెచ్చరించిన కోదండరామ్

తెలంగాణలో టీఆర్ఎస్ ను గద్దెదించే లక్ష్యంతో ఏర్పాటైన తెపవే (తెలంగాణ పరిరక్షణ వేదిక)లో తమకు ఇచ్చే సీట్లపై తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్, కాంగ్రెస్ పార్టీకి 48 గంటల డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. మహాకూటమిగా ఏర్పడిన తరువాత, కూటమిలోని పార్టీలకు ఇచ్చే సీట్లపై కాంగ్రెస్ తేల్చడం లేదని ఆరోపించిన ఆయన, తమకు కేటాయించే సీట్ల విషయంలో గురువారం రాత్రికి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

లేకుంటే, 21 మందితో తన తొలి జాబితాను విడుదల చేస్తామని ఆయన హెచ్చరించారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ ధోరణి సంతృప్తికరంగా లేదని వ్యాఖ్యానించిన ఆయన, 25 మందితో తమ రెండో జాబితా కూడా సిద్ధం అవుతోందని అన్నారు. తాము 19 సీట్లలో పోటీ చేయాలని తొలుత భావించామని, ఈ స్థానాల విషయాన్ని కాంగ్రెస్ కు చెప్పామని ఆయన అన్నారు.

Kodandaram
Mahakutami
Congress
Telangana
Elections
  • Loading...

More Telugu News