Bhilai: భిలాయ్ ఉక్కు పరిశ్రమలో ఘోర ప్రమాదం.. గ్యాస్‌ పైప్‌లైన్ పేలి 9 మంది దుర్మరణం

  • గ్యాస్ పైపులైను పేలడంతో ఘటన
  • ప్రమాద సమయంలో ప్లాంట్‌లో 24 మందికిపైగా కార్మికులు
  • గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమం

చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ ఉక్కు పరిశ్రమలో సంభవించిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్లాంటులోని కోక్ ఓవెన్ సెక్షన్ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు దుర్గ్‌ రేంజ్‌ ఐజీ జీపీ సింగ్‌ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 24 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.

Bhilai
Steel plant
Chattishgadh
Gas pipe line
  • Loading...

More Telugu News