Telangana: రాజకీయ నాయకుల నుంచి ముందు జాగ్రత్త.. రంగారెడ్డి జిల్లాలోని గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం!
- తెలంగాణలో రాజుకున్న ఎన్నికల వేడి
- నాయకుల మద్యం ఎరకు లొంగకూడదని నిర్ణయం
- నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.2 వేల జరిమానా
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోవడంతో ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు. రాజకీయ నాయకులు వేసే ఎరలకు ఆశపడి, గుడ్డిగా వారిని అనుసరించకుండా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మర్పలి మండలంలోని ఖల్కోడ గ్రామ ప్రజలు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఎన్నికల ప్రచారానికి వస్తున్న నాయకులు మద్యాన్ని ఎరగా వేసి ఓట్లు గుంజేందుకు ప్రయత్నిస్తారని, వారి బారిన పడి మోసపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గ్రామస్తులంతా కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారికి రూ.2 వేల జరిమానా విధించనున్నట్టు గ్రామ పెద్దలు హెచ్చరించారు.