Smart Phone: స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించిన అమెజాన్

  • హువేయి పీ20 ప్రో, నోవా3 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్
  • హువేయి పీ20 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 54,999
  • నోవా 3 స్మార్ట్‌ఫోన్ రూ. 15,999
  • ఆఫర్ అక్టోబర్ 10వ తేదీ నుంచి 14 వరకు..

తమ వినియోగదారులకు అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2018 సేల్ పేరుతో మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రిడెట్, డెబిట్ కార్డుల ద్వారా అమెజాన్ ఇండియాలో స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారులు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. హువేయి పీ20 ప్రో, నోవా3 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

అక్టోబర్ 10వ తేదీ నుంచి అమెజాన్ ఫెస్టివల్ సీజన్ సేల్.. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. హువేయి పీ20 ప్రో స్మార్ట్‌ఫోన్ రూ. 54,999, నోవా 3 స్మార్ట్‌ఫోన్ రూ. 15,999కే అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటుందని, మొబైల్ కొనుగోలు చేసిన కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది.

Smart Phone
Amazon
SBI
India
Nova 3
  • Loading...

More Telugu News